యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్న భారీ బడ్జెట్ సెన్సేషనల్ మూవీ సాహో. రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ పతాకంపై నిర్మాతలు వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలున్నాయి. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
సాహో ప్రమెషన్ అంతా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపించినా ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ లో లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ కనిపించడం విశేషం. సాహో లో ఇంకా షేడ్స్ వున్నాయని విడుదల తేది లోపు సాహో లు వున్న షేడ్స్ ఆప్ సాహో తెలియజేస్తాం అని యూనిట్ సబ్యులు అంటున్నారు.ఈ చిత్రం ఇండియాలో మెట్టమెదటిగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజి తో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం అగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
బాహుబలి లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా పై భారి అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా చిన్న విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాలని నిర్ణయించుకున్నారు. హైస్టాండర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయటం వలన హడావుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న సినిమా లవర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబందించి మెదటి సింగిల్ ని విడుదల చేశారు. రెండవ సింగిల్ ని అతి త్వరలో విడుదల చేస్తున్నారు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..


