డియర్ కామ్రేడ్‌తో పోటీ పడుతున్న ఆరు సినిమాలు

0
532

గీతా గోవిందం సినిమా త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందన్న జంటగా న‌టించిన డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాను కేవ‌లం తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల‌లోను ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాకు పోటీగా మ‌రే సినిమా విడుదలకు లేకపోయినా, త‌మిళంలో మాత్రం ఆరు సినిమాలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

ప్రముఖ హాస్య నాటుడు సంతానం నటించిన ‘ఏ1’, నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొలైయుధిర్ కాలం’, దర్శకుడు సముద్ర ఖని నటించిన ‘కొలాంజి, ‘నుంగంబాకం’,’చెన్నై పళని మార్స్’, ‘ఆరడి’ అనే సినిమాలు డియర్ కామ్రేడ్‌తో పాటు విడుద‌ల‌కి సిద్దం అయ్యాయి. ఈ సినిమాల్లో ‘ఏ1’, ‘కొలైయుధిర్ కాలం’ సినిమాల పట్ల అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆరు సినిమాలతో డియ‌ర్ కామ్రేడ్ పోటీ ప‌డ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here