విడుదలకు సిద్దమైన దండుపాళ్యం-4

0
462

దండుపాళ్యం పేరుతో వచ్చిన మొదటి మూడు సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రైమ్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాలు ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాయి. అయితే ఈ సిరీస్ లో చివరి చిత్రం రాబోతుంది. అదే దండుపాళ్యం-4. కర్ణాటకలో సెన్సార్ సమస్యల్ని ఎదురుకొన్న ఈ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. చిత్రాన్ని వెంకట్ నిర్మించగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించారు. సుమన్ రంగనాథన్, ముమైత్‌ ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్‌ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ కర్ణాటకలో సినిమా చూసిన సెన్సార్ సభ్యులు రిజెక్ట్ చేశారు. దాంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాం. వారు సినిమాలోని చాలా సీన్స్ తొలగించారు. దాంతో ఢిల్లీ ట్రిబ్యునల్‌కు వెళితే సమాజానికి ఉపయోగపడే సినిమాగా గుర్తించి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు. దండుపాళ్యం సిరీస్ చిత్రాలకు ఈ సినిమాతో చక్కటి ముగింపును ఇవ్వబోతునమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here