విక్రమ్ సినిమాపై మలేషియా ప్రభుత్వం నిషేధం

0
438

తమిళ నటుడు చియాన్‌ విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మిస్టర్ కెకె. తమిళ్లో ‘కదరం కొండన్‌’ అనే పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమాను తెలుగులో మిస్టర్ కెకెగా రిలీజ్‌ చేశారు. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మలేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఎక్కువ భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మలేషియా పోలీసులను తప్పుగా చూపించినందకు గానూ మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని చిత్ర మలేషియా డిస్ట్రిబ్యూటర‍్స్‌ లోటస్‌ ఫైవ్‌ స్టార్‌ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు కమల్‌ హాసన్‌ నిర్మాత. కమల్‌ చిన్న కూతురు అక్షరా హాసన్‌తో పాటు అభి హసన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మిస్టర్ కెకె గా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here