రేపు గ్రాండ్ లెవెల్లో జరుగనున్న సూర్య ‘కాప్పన్’ ఆడియో రిలీజ్ వేడుక…..!!

0
161

తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా కాప్పన్. గతంలో సూర్య మరియు దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న కాప్పన్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి అనే చెప్పాలి. ఇక ఇటీవల వీక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ హైప్ మరింత పెరిగింది. తెలుగులో ఈ సినిమాను బందోబస్త్ పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధి గా రేపు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్య ఎన్ ఎస్ జి కమాండర్ పాత్రలో కనపడనున్నారట. ఆకట్టుకునే వైవిధ్యమైన కథ మరియు కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో సాయేషా, ఆర్య, బోమన్ ఇరానీ, సముద్ర ఖని తదితరులు నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగష్టు 30 న విడుదల చేయాలని చూస్తోంది సినిమా యూనిట్…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here