రెండు రోజుల్లో రూ.25 కోట్లు కొల్లగొట్టిన ఇస్మార్ట్ శంకర్…..!!

0
2946

ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మూవీ ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన యంగ్ బ్యూటీస్ నభ నటేష్, నిధి అగర్వాల్ జతకట్టిన ఈ మాస్ మూవీ, ప్రస్తుతం విడుదలైన ప్రతి చోట అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని కొల్లగొట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.

హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి తోడు దర్శకుడు పూరి రాసిన డైలాగులను తెలంగాణ స్లాంగ్ లో పలికిన హీరో రామ్ కు థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన వినసొంపైన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి. పూరి జగన్నాథ్ తన సొంత బ్యానరైన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి ఎంతో లావిష్ గా నిర్మించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింతగా అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here