నేడు 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న లిటిల్ ప్రిన్సెస్ ‘సితార ఘట్టమనేని’…..!!

0
202

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మరియు నమ్రత గార్ల ముద్దుల తనయ సితార నేడు 7వ ఏడాదిలోకి అడుగిడుతోంది. మొదటినుండి తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ గురించిన విషయాలను కూడా సూపర్ స్టార్ మహేష్ ఎప్పటికపుడు అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికపుడు పంచుకుంటూ ఉంటారు. తన తల్లి ఇందిరాదేవి గారిని ముమ్మూర్తులా పోలి ఉండే కూతరు సితార అంటే సూపర్ స్టార్ కు ఎనలేని అభిమానం. ఇక నమ్రత గారు కూడా ఎప్పటికపుడు గౌతమ్ మరియు సితారలకు సంబందించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇక మూడు రోజుల క్రితం దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన సితార, ఇప్పటినుండే తండ్రి వలె అభిమానులను సంపాదిస్తూ ముందుకు సాగుతోంది. ఘట్టమనేని అభిమానులు ఆమెను ముద్దుగా లిటిల్ ప్రిన్సెస్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక నేడు 7వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సితారకు వారు విశేషంగా జన్మదిన శుభాకాంక్షలు తెల్పుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేయడం, అన్నదానాలు చేయడం, అలానే వృద్దులకు, అనాధలకు తమ వంతు సాయం అందించడం వంటి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో తాతయ్య సూపర్ స్టార్ నటశేఖర కృష్ణగారి వలే, అలానే తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వలె ప్రిన్సెస్ సితార కూడా అత్యున్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ ఘట్టమనేని అభిమానులు ఆమెకు సోషల్ మీడియా మాధ్యమాల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here