బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా రాక్షసుడు. ఇటీవల తమిళంలో విడుదలై అక్కడ ఘన విజయం సాధించిన రాచ్చసన్ సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం లక్షలాది వ్యూస్ తో వీక్షకుల అభిమానంతో దూసుకుపోతోంది. అమ్మాయిలను చంపే సైకో, అతన్ని పట్టుకోవడానికి వెతుకులాడే ఒక పోలీస్ టీమ్, ఇంతకీ ఈ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతుంటాడు,
మరి అతన్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేసాడనే థ్రిల్లింగ్ కథాంశంతో సాగిన ఇక ఈ ట్రైలర్ పై హీరో వరుణ్ తేజ్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తదితరులు ప్రశంశలు కురిపించారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడమే కాక, రేపు విడుదల కాబోయే సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించిందని, ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ, దర్శకులు రమేష్ వర్మ సహా యూనిట్ సభ్యులందరికి సినిమా మంచి సక్సెస్ సాదించాలని కోరుతూ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ద్వారా భారీ స్థాయిలో ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు…..!!
Click Here To Watch Rakshasudu Trailer


