సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు

0
180

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్స్ తో రెండు వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అదే ఊపుతో ప్రస్తుతం అయన నటిస్తున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు. అపజయం ఎరుగని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సహా, మరికొందరు ఆర్టిస్టులు పాల్గొన్న ఈ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయిందని, ఈ నెల 26 నుండి హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ప్రారంబించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది.

అంతేకాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో తన కెరీర్ లో తొలిసారి పని చేస్తున్న ఈ అద్బుతమైన అనుభవం ఎప్పటికి మరిచిపోలేనిదని అయన తన పోస్ట్ ద్వారా తెలిపారు. సూపర్ స్టార్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు సినెమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here