థ్రిల్లింగ్ సస్పెన్స్ తో ఆకట్టుకుంటున్న అడివి శేష్ ‘ఎవరు’ టీజర్…..!!

0
560

నటనతో పాటు రచయితగా కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు అడివి శేష్. ప్రస్తుతం అయన హీరోగా నటిస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు. వెంకట్ రామ్ జీ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఇక ఈ సినిమా అధికారిక టీజర్ ని కాసేపటి క్రితం హీరోయిన్ సమంత అక్కినేని చేతులమీదుగా యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఒక మర్డర్ సీన్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్ లో, నా విషయంలో ఏమి జరిగిందో మీకు తెలుసు, ఐ కెన్ ఫైట్ అంటూ హీరోయిన్ రెజీనా పలికే డైలాగ్ సినిమా పై సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది.

టీజర్ లో తమిళనాడుకు చెందిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్ గా అడివిశేష్ కనిపించడం, పోలీసులు మర్డర్ అని అంటుంటే, మీరేమో రేప్ అంటున్నారు, రెండూ ఒకవేళ నిజాలు కాకపోతే అంటూ టీజర్ చివర్లో అయన పలికిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. మురళి శర్మ, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రసాద్ వి పొట్లూరి, పరం వి పొట్లూరి, కెవిన్ అన్నే పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

Click Here To Watch Evaru Teaser

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here