1 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న కార్తికేయ ‘గుణ 369’ ట్రైలర్…..!!

0
190

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా యువ దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ,స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలుగా నిర్మితం అవుతున్న కొత్త చిత్రం గుణ 369. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు పాటలకు వీక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు దర్శకులు బోయపాటి శ్రీను గారి చేతుల మీదుగా బుధవారం యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆకట్టుకునే అంశాలతో సాగిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ 1 మిలియన్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. మొబైల్ షాప్‌లో హీరోయిన్‌ని చూసి తొలి చూపులోనే హీరో ప్రేమలో పడటం, ఆ ప్రేమకు అడ్డంకులు ఏర్పడటం, ఆ అడ్డంకుల్ని అధిగమించడానికి అతడు కత్తి పట్టి విలన్లను ఎదుర్కోవడం వంటి అంశాలతో ట్రైలర్ సాగింది. అంతేకాక ట్రైలర్ చివరిలో హీరో, ఖైదీ నెంబర్ 369 పేరుతో జైలు నుండి విడుదలయ్యే సీన్‌‌ సినిమాపై అంచనాలు పెంచుతుంది. లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా ఒక యదార్ధ గాధ స్పూర్తితో సహజత్వానికి దగ్గరగా రూపొందిన తమ చిత్రం, రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ద్వారా అనఘ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంగీతాన్ని చైతన్ భరద్వాజ్ అందిస్తుండగా, రామ్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here