బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

0
152

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ల కలయికలో ఎన్నో అంచనాల మధ్య నిన్న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన యంగ్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభ నటేష్ జతకట్టిన ఈ సినిమాను పూరి తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి నిర్మించడం జరిగింది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల తరువాత సినిమా పై అంచనాలు విపరీతంగా పెరగడంతో, ఆ అంచనాలను అందుకోవడంలో ఇస్మార్ట్ శంకర్ పూర్తిగా సఫలమయ్యాడు.

పూరి మార్క్ కథ, కథనాలు మరియు టేకింగ్, హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, మణిశర్మ అదరగొట్టే సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్ల ఆకట్టుకునే నటన మరియు అందం వెరసి ఈ సినిమాను ప్రేక్షకుడికి ఎంతో చేరువ చేసాయి. ఇక సినిమాపై నిన్నటినుండి ప్రేక్షకులు సహా కొందరు సినీ ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. సంచలన దర్శకులుగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా సినిమా అద్భుతంగా ఉంది అంటూ పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాక పూరి గారు మీరు వెంటనే ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చేయండి, అది డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ రేంజిలో అదిరిపోవాలి అంటూ అయన ఫన్నీగా ట్వీట్ చేశారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here