స్ట్రైకింగ్ గా అడివి శేష్ ‘ఎవరు’ ఫస్ట్ లుక్….!!

0
174

‘క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో నటుడిగా, కథా రచయితగా తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్న దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. `బ‌లుపు`, `ఊపిరి`, `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంకట్ రామ్ జీ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రీ లుక్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇక నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సినిమా యూనిట్ విడుదల చేసింది. హీరో, హీరోయిన్లు శేష్ మరియు రెజినాల కలయికలో రూపొందిన ఈ పోస్టర్ లో అద్దంలో రెజీనా కొంత భయానక మొహంతో కనపడడం గమనించవచ్చు. నేడు విడుదలైన ఈ పోస్టర్, సినిమా పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను గురువారం విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో అడివిశేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ: కాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here