తుపాకీ పట్టిన బామ్మ పాత్రలో తాప్సి

0
464

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నో బయోపిక్ లు రూపొందాయి. తాజాగా తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే చిత్రం రూపొందుతుంది. తుషార్‌ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా ఇద్దరు అక్కచెల్లెళ్ల బయోపిక్ కావడం విశేషం. ఈ సినిమా టీజ‌ర్ ఈరోజు విడుద‌లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘సాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా రూపొందుతుంది. ఇందులో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ న‌టిస్తుండ‌గా, 82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు ఉత్తరప్రదేశ్ లో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. లేటు వయసులో షూటింగ్ పోటీలో పాల్గొని వీరు 300 పతకాలను కొల్లగొట్టారు. ఈ సంవత్సరం దీపావ‌ళి కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here