అక్కినేని సమంతను సర్ప్రైజ్ చేసిన నెటిజన్..

0
101

అక్కినేని సమంతను ఓ నెటిజన్ సర్ప్రైజ్ చేసాడు. ఆమె చిన్నప్పటి ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి సమంతను ట్యాగ్ చేస్తూ.. ఫోటో ఆఫ్ ది డే అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో సమంత ఒక్కసారిగా సర్ప్రైజ్ అయింది. వెంటనే ఆ ఫోటో మీకెలా దొరికిందని ఆ నెటిజన్ ను అడిగారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమకు బాగా నచ్చిందంటూ నెటిజన్లు సమంతకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. వారందరికీ సమంత పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నారు. ఆ క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో అభిమాని.. సమంత, నాగచైతన్య, అఖిల్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ఈ ఫొటోపై ఆమె స్పందిస్తూ..‘ఆ రోజు మేం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా నాకు ఇంకా గుర్తుంది’ అని పేర్కొన్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే త్వరలో ఆమె ‘96’ రీమేక్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here