ప్రీమియర్ షో చూసి ‘దొరసాని’ సినిమాని ప్రశంసించిన పలువురు దర్శకులు…..!!

0
177

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక తొలిసారి టాలీవుడ్ కి హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న దొరసాని సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పాటలు మరియు ట్రైలర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచగా, వాటిని అందుకోవడంలో రేపు విడుదల కానున్న తమ సినిమా తప్పకుండా సఫలీకృతం అవుతుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, నేడు ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది సినిమా యూనిట్, ఇక ఆ షో చూసిన టాలీవుడ్ లోని కొందరు యువ దర్శకులు సినిమా అద్భుతంగా ఉంది.

కొత్త నటులైనప్పటికీ ఆనంద్, శివాత్మిక ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, ముఖ్యంగా దర్శకుడు మహేంద్ర గారు సినిమాని ఆద్యంతం ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అని, తప్పకుండా రేపు విడుదల తరువాత ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ముందస్తుగా అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమా చూసి ప్రశంసించిన వారిలో అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అ మరియు కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్ఎక్స్100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి, జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, పి ఎస్ వి గరుడ వేగా సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఉన్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here