‘నిను వీడని నీడను నేనే’ ఫస్ట్ టికెట్ లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్…..!!

0
159

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ రేపు విడుదలకు సిద్దమయింది. ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కు వీక్షకుల నుండి మంచి స్పందాన్ లభించడంతో సినిమా యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు తెరపై వచ్చిన హర్రర్ సినిమాలకు కొంత భిన్నమైన కాన్సెప్ట్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో టాలీవుడ్ యువ హీరోలు ప్రత్యేక అతిథులుగా ఎంతో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను యంగ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ ప్రభాస్ లాంచ్ చేశారు. ప్రచార చిత్రాలు చూశానని, ఈ చిత్రంతో సందీప్ కిషన్ మంచి విజయం అందుకుంటాడని ఆశిస్తున్నానని ఆయన ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “ప్రభాస్ అన్న అందరి మంచి కోరే వ్యక్తి. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆయన అండగా నిలబడతారు. మేం అడగ్గానే మా ఆహ్వానాన్ని మన్నించి ‘నిను వీడని నీడను నేనే’ ఫస్ట్ టికెట్ లాంచ్ చేశారు. ప్రభాస్ అన్నకు చాలా చాలా థాంక్స్. కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతోంది. ఇదొక న్యూ ఏజ్ హారర్ ఫిల్మ్. ప్రేక్షకులకు కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అందరికీ మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది” అని అన్నారు.

ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ సొంత నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రొడక్షన్స్, వి స్టూడియోస్‌ బ్యానర్లపై దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలుగా, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో తొలిసారి సందీప్ ఈ సినిమా ద్వారా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నారు.

పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here