‘వృషకర్మ’లో మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజువల్స్ చూస్తారు. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ‘వృషకర్మ’ ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యువ సామ్రాట్ నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ మిస్టరీస్, వేదిక్ సైన్స్, సూపర్‌నేచురల్ ట్రైలర్ లాంచ్
యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వృషకర్మ’. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తులు నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
5 వేల సంవత్సరాల క్రితం నాటి పురాతన, ఒక మిస్టీరియస్ అతీంద్రియ శక్తిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మొదట ఒక ట్రెజర్ హంటర్ ప్రయాణంగా మొదలైన కథ, క్రమంగా మానవాళికి ముప్పు కలిగించగల ఒక పురాతన శక్తి చుట్టూ అల్లుకున్న పెద్ద రహస్యంగా మారుతుంది. సాధారణ మానవుల ఆలోచనలకు అందని వేద విజ్ఞానం, శక్తుల నేపథ్యంలో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. చివరికి సృష్టి ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించిన దైవిక శక్తిగా కథానాయకుడు ‘వృషకర్మ’గా మారడం ఆసక్తిని పెంచుతోంది.
‘విరూపాక్ష’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు, ‘వృషకర్మ’తో మరింత భారీ స్థాయిలో కథను తెరకెక్కించారు. పురాణాలు, మిస్టరీ, సస్పెన్స్ అంశాలను కలిపి ఒక ఆసక్తికరమైన కథనాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రహస్యమైన గుర్తులు, పురాతన చిహ్నాలు, విభిన్నమైన పాత్రలతో ఈ సినిమాను ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది.
నాగ చైతన్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ట్రెజర్ హంటర్ పాత్రలో రఫ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ గా కూడా చాలా కష్టపడ్డారని ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే అర్థమవుతోంది. మీనాక్షి చౌదరి, కియారా ఖన్నా తమ పాత్రలతో కథపై మరింత ఆసక్తిని పెంచగా, జయరామ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఆయన విభిన్నమైన గెటప్స్, భయపెట్టే హావభావాలు చూస్తుంటే సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్ధమౌతోంది. అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథలో ఆయన పాత్ర మరింత భయానక వాతావరణాన్ని తీసుకురానుంది. మరోవైపు సత్య తన కామెడీతో కథలో కొంత రిలీఫ్ ఇవ్వనున్నారు.
టెక్నికల్‌గా ట్రైలర్ చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల రూపొందించిన భారీ గుహల సెట్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి డీటెయిల్‌ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ ఈ మిస్టీరియస్ ప్రపంచాన్ని అద్భుతంగా చూపించింది. బి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచుతూ, థ్రిల్స్‌తో పాటు ఎమోషన్స్‌ను కూడా ఎలివేట్ చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ . సినిమా ప్రొడక్షన్ స్కేల్, విజువల్ ట్రీట్మెంట్ చూస్తుంటే ప్రేక్షకులకు గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ ఎక్కడా రాజీపడలేదని అర్ధమౌతోంది.
కార్తీక్ దండు ఒక విభిన్నమైన మైథలాజికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడం, నాగ చైతన్య పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించడం, ఆసక్తికరమైన కథాంశంతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘వృషకర్మ’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నెల్లూరు రావడం చాలా ఆనందంగా ఉంది. అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘వృషకర్మ’ సినిమా కథ కార్తీక్ చెప్పినప్పుడు నిజానికి ఆ కథకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. అంత ఒరిజినల్‌గా రాశారు. చాలా ఫ్రెష్ ఐడియా. ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి. మేము ఇంతకాలం దేని కోసమైతే కష్టపడ్డామో ఆ విజువల్స్ అన్నీ మీకు ట్రైలర్లో కనిపించాయి. డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. సినిమా రెండు గంటల 50 నిమిషాలు ఉంటే, దాదాపు ప్రతి ఫ్రేమ్‌లో ఏదో ఒక వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు ఉంటాయి. అలాంటి అద్భుతమైన విజన్‌ను డైరెక్టర్ కార్తీక్ తీసుకొచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో నా డైరెక్టర్ కార్తీకే. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు వచ్చి ఇండియా అంతటా తమ సత్తా చాటారు. ఆ లిస్టులో కార్తీక్ కూడా చేరబోతున్నారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత స్పర్ష్ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తను చాలా కష్టపడి ఈ పాత్ర చేశాడు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ.మీనాక్షి కూడా ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమా చేసింది. మా నిర్మాత ప్రసాద్ గారు ఏ కష్టం వచ్చినా చిరునవ్వుతో ‘అంతా నేను చూసుకుంటాను’ అని చెప్పేవారు. ఆయనే మా ధైర్యం. అంత ధైర్యంగా ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 4న ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఒక సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరినీ తప్పకుండా అలరిస్తామని నమ్ముతున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా కొత్త విషయాలను బిల్డ్ చేశాం. ఖచ్చితంగా ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. డిసెంబర్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఇక్కడే ‘ఛత్రపతి’ సినిమా షూటింగ్ చేశాం. మళ్లీ ఈరోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం నెల్లూరు రావడం చాలా ఆనందంగా ఉంది. ‘ఛత్రపతి’ ఎంత పెద్ద విజయం సాధించిందో, ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
స్పర్ష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన ప్రేక్షకులు. సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. చైతు గారితో కలిసి సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
నటీనటులు: యువ సామ్రాట్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా, సత్య
టెక్నికల్ టీమ్:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా



