ఎనర్జిటిక్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ ప్రోమో సాంగ్….!!

0
321

రామ్, పూరి జగన్నాథ్ ల కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ మాస్, కమర్షియల్ మూవీ ఇస్మార్ట్ శంకర్. నటి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలోని సాంగ్స్ మరియు ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ట్రైలర్ లో పూరి మార్క్ డైలాగ్స్, రామ్ స్టైలిష్ యాక్షన్, హీరోయిన్లు నభ నటేష్, నిధి అగర్వాల్ ల అందాలు వెరసి ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేశాయనే చెప్పాలి.

అంతేకాక సినిమా యూనిట్ కూడా రేపు విడుదల తరువాత మంచి హిట్ కొడతాం అని కాన్ఫిడెంట్ గా చెపుతోంది. ఈ సినిమాలోని సాంగ్స్ లో ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ప్రోమోను కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. మంచి మాస్ స్టయిల్లో హీరో రామ్ స్టన్నింగ్ డాన్స్ మూమెంట్స్ తో ఎనర్జిటిక్ గా సాగిన ఈ సాంగ్ కి భాస్కరభట్ల అందించిన లిరిక్స్, సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన విధానం యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here