శ్రద్దా కపూర్ పెళ్లంటూ ప్రచారం..విచిత్ర సమాధానం చెప్పిన ఆమె తండ్రి

0
139

బాలీవుడ్‌ నటి శ్రద్దా కపూర్ సాహో సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం బాలీవుడ్ మీడియా శ్రద్ధాకపూర్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు ప్రచారం చేసింది. శ్రద్ధా కపూర్‌, తన బాయ్‌ఫ్రెండ్‌ రోషన్‌ శ్రేష్టను త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేసింది. ఈ అంశమై శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ను కూడా ప్రశ్నించింది. అయితే ఈ అసత్య ప్రచారానికి శక్తి కపూర్‌ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.

మీడియా విలేకర్లు మీ కూతురి వివాహమట కదా అని ప్రశ్నిచగా.. శక్తి కపూర్ స్పందిస్తూ..‘నిజంగానా.. నా కూతురు వివాహం చేసుకోబోతుందా.. ఎక్కడా..ఎప్పుడు.. తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలియదు. దయచేసి నా కూతురు పెళ్లికి నన్ను కూడా పిలవడండి’ అంటూ బదులిచ్చారు. శ్రద్ధాకపూర్‌ పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్ని అవాస్తవాలే అంటూ ఆయన కొట్టి పారేశారు. ఇక శ్రద్ధ కపూర్ సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమె ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here