సారి చెప్పనని మొండికేసిన హీరోయిన్!

0
70

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన పనికి నిర్మాత ఏక్తాక‌పూర్ జ‌ర్న‌లిస్టుల‌కు సారీ చెప్పారు. కానీ కంగన మాత్రం సారీ చెప్పానని భీష్మించుక కూర్చున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కంగ‌నా, రాజ్‌కుమార్ రావ్ కలిసి నటించిన జ‌డ్జ్‌మెంటల్ హై క్యా ప్ర‌మోష‌న‌ల్ ప్రెస్ మీట్ జ‌రిగింది. అందులో కంగ‌నా త‌న `మ‌ణిక‌ర్ణిక‌` సినిమాను త‌క్కువ చేసి రాశావంటూ ఓ జ‌ర్న‌లిస్టుపై తీవ్ర వ్యాఖ్య‌లకు దిగింది. ఇది కాస్త చిన్నపాటి వివాదానికి దారి తీసింది. దీంతో ఈ వివాదంపై మూవీ జ‌ర్న‌లిస్ట్ గిల్డ్ సీరియ‌స్ అయ్యింది.

జర్నలిస్టుని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కంగ‌నా సారీ చెప్ప‌క‌పోతే ఆమెకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్‌ను క‌వ‌ర్ చేయ‌మ‌ని తేల్చేసింది. వివాదం సీరియ‌స్‌ కావడంతో జ‌డ్జ్‌మెంట‌ల్ హై క్యా సినిమా నిర్మాత ఏక్తాక‌పూర్ జ‌ర్న‌లిస్టుల‌ను క్ష‌మాప‌ణ కోరుతూ ఓ పత్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. అయితే కంగ‌నా సోద‌రి రంగోలి మాత్రం తన సోదరి సారీ చెప్ప‌దంటూ, ఆమెను క్ష‌మాప‌ణ‌లు అడిగే అర్హ‌త మీకు లేదంటూ తిరగబడింది. దీంతో నెటిజ‌న్స్ కంగనా, రంగోలి ప్ర‌వ‌ర్త‌నపై కామెంట్స్ చేస్తున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారని విమర్శిస్తున్నారు. ఈసినిమా జులై 26న విడుదలవుతునందున రిలీజ్ కు ముందైనా కంగనా జర్నలిస్టులకు సారి చెబుతుందో లేదో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here