ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’…..!!

0
494

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుల్లో నాచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాల్లో ఒకటైన గ్యాంగ్ లీడర్ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. దానికి ప్రధాన కారణం, ఈ సినిమాను విభిన్న తరహా సినిమాలను తెరకెక్కించడంలో పేరుగాంచిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడమే. ఆయన గత సినిమాల తరహాలోనే ఈ గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఇంతకముందెన్నడూ రాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విభిన్నమైన కథ మరియు కథనాలతో పాటు వినోదాత్మకంగా రూపొందుతున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఈ సినిమాని ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఒక ముఖ్య క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here