అంచనాలు పెంచిన డియర్ కామ్రేడ్ ట్రైలర్…..!!

0
448

వరుస విజయాలతో యువత మనసు కొల్లగొడుతూ ముందుకు సాగుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ డియర్ కామ్రేడ్. విజయ్ సరసన రెండవసారి రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు భరత్ కమ్మ తొలిసారి మెగా ఫోన్ పట్టడం జరుగుతోంది. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదలై మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. ఒక కామ్రేడ్ పోరాడితే ఆ పోరాటం అతనికి హాయిని, స్వేచ్చని ఇవ్వాలి, కానీ నిన్ను చూస్తే అలా లేవు అంటూ సీనియర్ నటులు చారు హాసన్ గారి మాటలతో ప్రారంభమయ్యే ఈ సినిమా ట్రైలర్, ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. నువ్వు ప్రేమించేదాని కోసం ఎందాకైనా పోరాడు అనే కాన్సెప్ట్ తో విభిన్నంగా సాగిన ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ రష్మిక జంట యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తొలిసారి రష్మిక ఒక క్రికెటర్ పాత్రలో నటిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించడం జరిగింది, ఇక విజయ్ పలికిన ‘వచ్చినపుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ, వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధ పెడుతోంది’, ‘నన్ను భయపెడుతున్నాం అనుకుంటున్నారేమో, కానీ మీరే భయపడుతున్నట్లు కనిపిస్తోంది’ వంటి డైలాగ్స్ యూత్ ని బాగ్ అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒక మంచి హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందించిన ఈ సినిమాకు సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here