బాలీవుడ్‌కు పయనమైన ‘ఓ బేబీ’!

0
59

గతకొంత కాలంగా తెలుగు, తమిళ చిత్రాలు ఎక్కవగా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగులో విజ‌యం సాధించిన ‘ఓ బేబి’ చిత్రం కూడా హిందీలో రీమేక్ కానుంద‌ని తెలుస్తోంది. ఈ రీమేక్‌లో రానా దగ్గుబాటి ప్ర‌ధాన పాత్రలో నటిస్తారని తెలుస్తుంది. ఇక కథానాయిక స‌మంత పాత్ర‌లో కంగ‌నా రనౌత్ లేదా అలియా భట్ న‌టిస్తారని సమాచారం.

బాలీవుడ్ దర్శ‌క నిర్మాత‌లలో ఒకరు ఇప్ప‌టికే ‘ఓ బేబీ’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారట. ఓ బేబి చిత్రం కొరియ‌న్ మూవీ ‘మిస్ గ్రానీ’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. బీవీ నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంలో ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, తేజ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి 24ఏళ్ళ పడచు పిల్ల వయసులోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం హిందీ ప్రేక్ష‌కుల‌ని కూడా త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు అనేక ఆసియా భాషలలో రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here