బిగ్ బాస్ 3 ప్రసార తేదీ ఖరారు

0
470

ఇప్పటివరకు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ రెండు సీజన్లు ఆడియన్స్ నుండి మంచి ఆదరణను పొందడం జరిగింది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ఆ సీజన్ ను మంచి సక్సెస్ చేయగా, ఆపై వచ్చిన రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి, షోను మరింత సక్సెస్ చేసారు అనే చెప్పాలి. ఇక అతిత్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సీజన్ 3 పై మంచి అంచనాలున్నాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్న ఈ సీజన్ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.

ఇకపోతే నిన్న, స్టార్ మా ఛానల్ వారు మరొక ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో మనుషులు మాములుగా తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ, కెమెరా ముందుకు మాత్రం నటిస్తారు అంటూ ఆకట్టుకునేలా సాగిన ఈ ప్రోమోలో సీజన్ 3 ప్రారంభోత్సవ తేదీ మరియు సమయాన్ని ప్రకటించడం జరిగింది. ఈనెల 21వ తేదీన రాత్రి 9 గంటలకు సీజన్ 3 వేడుకగా ప్రారంభం కానుంది. అయితే షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ వివరాలు మొదటి రోజు షోలో వెల్లడి కానున్నట్లు సమాచారం…….!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here