డబ్బింగ్ కార్యక్రమాలు మొదలెట్టిన బన్నీ, త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ..!!

0
104

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మహర్షితో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత తరణంగం ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు నేటి నుండి మొదలైనట్టు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్ గా, బన్నీతో చేసిన గత రెండు సినిమాలను మించేలా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బన్నీ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలతో పాటు ఈసారి త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మరింతగా పేలనున్నాయని అంటున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు పి ఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్, సుశాంత్, టబు, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రామకృష్ణ, సునీల్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here