బలమే జీవితం, గెలిచేవరకు పోరాటమంటూ సాగిన ‘మిస్ మ్యాచ్’ టీజర్…..!!

0
54

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ వారు తమ తొలిప్రయత్నంగా నిర్మిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. యువ నటీనటులు ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్), ఐశ్వర్య రాజేష్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. కొన్నాళ్ల క్రితం నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా విభిన్న కథాంశంతో రూపొందిన ‘సలీం’ అనే సినిమాను తెరకెక్కించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మనిషికి బలహీనత చావు, బలం జీవితం, కాబట్టి జీవితంలో గెలిచేదాకా పోరాడు అనే కథాంశముతో సాగిన ఈ టీజర్ లో హీరో ఉదయ్, హీరోయిన్ ఐశ్వర్య జంట అలరించింది.

క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఐశ్వర్య మరొక్కమారు క్రీడాకారిణిగా కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలు, ఫోటోగ్రఫీ తో టీజర్ ఆకట్టుకుంటోంది . టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్న ఈ సినిమాలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here