వరుస విజయాలతో దూసుకుపోతూ, ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజీ హీరోగా పేరు సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న విజయ్ ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ మూవీస్ లో ఒకటి ‘డియర్ కామ్రేడ్’. యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితం అవుతన్న ఈ సినిమాలో విజయ్ సరసన మరొక్కసారి రష్మిక మందన్న హీరోయిన్ గా జోడీకడుతోంది.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు విడుదలైన సాంగ్స్, సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇకపోతే ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని ఈ నెల 11న ఉదయం 11 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నట్లు డియర్ కామ్రేడ్ యూనిట్ కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!