రేపు విజయవాడలో సందడి చేయనున్న “ఓ బేబీ” హీరోయిన్ సమంత….!!

0
134

అక్కినేని సమంత ప్రధానపాత్రలో రూపొంది, ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ. కొద్దిరోజుల క్రితం కొరియన్ భాషలో రూపొంది మంచి సక్సెస్ సాధించిన మిస్ గ్రానీ అనే చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఓ బేబీ సినిమాపై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. సీనియర్ నటి లక్ష్మి, నటులు రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, తేజ సజ్జ, రావు రమేష్, నాగ శౌర్య, ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకాభిమానంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఓబేబీ హీరోయిన్ సమంత, రేపు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ విచ్చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గం. 30 ని. లకు విజయవాడలోని పివిపి స్క్వేర్ మాల్ ఎదురుగా గల రోడ్డులోని లబ్బీపేట ప్రాంతంలోని ఎస్ ఎస్ కన్వేషన్ హాల్ లో ఆమె అభిమానులతో తమ సినిమా విజయానందాన్ని పంచుకోనున్నారు. ఈ విషయమై సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించడం విశేషం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here