అవంతికగా మన్మధుడు – 2 టీజర్ లో అదరగొట్టిన రకుల్ ప్రీత్ సింగ్….!!

0
93

కింగ్ నాగార్జున హీరోగా కొన్నేళ్ల క్రితం విడుదలై మంచి రొమాంటిక్ హిట్ గా నిలిచిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం రూపొందుతున్న మన్మధుడు-2 సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. యువ నటుడు మరియు దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మనం ఎంటర్టైన్మెంట్స్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, స్టూడియో కెనాల్ సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అవంతిక అనే క్యారెక్టర్ లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రడక్షన్ టీజర్ ని విడుదల చేశారు.

అవంతిక పేరు ఎంత అందంగా ఉందొ, అమ్మాయి కూడా అంతే పద్దతిగా ఉంది అంటూ సేనియర్ నటి లక్ష్మి గారు పలికే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ ని బట్టి చూస్తే సినిమాలో రకుల్ సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా, అలానే మోడరన్ స్టయిల్ లో లైఫ్ ని గడిపే యువతిగా ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ‘ఇప్పటివరకు యు సర్టిఫికెట్ ప్రయత్నించాను, ఇకపై ఏ సర్టిఫికెట్ ప్రయత్నిస్తాను’ అంటూ నాగార్జునతో రకుల్ పలికే డైలాగ్ అవంతిక గా తన కారక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో చెప్తుంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి . గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here