‘ఓ బేబీ’ చిత్రాన్ని ప్రశంసించిన రకుల్ ప్రీత్..!!

0
58

ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, సునీతా తాటి, టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్ లు కలిసి సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘ఓ బేబీ’. యువ మహిళా దర్శకురాలు బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంపై అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినిమా ప్రముఖులు సైతం ముగ్ధులవుతూ పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

ఇక నేడు మరొక టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఓ బేబీ చిత్రాన్ని మరియు చిత్ర నటీనటులను అభినందిస్తూ ట్వీట్స్ చేయడం జరిగింది. ఓ బేబీ చిత్రం చూసాను, సమంత మ్యాజికల్ పెర్ఫార్మన్స్ ఈ చిత్రానికే హైలైట్, చిత్రం ఆద్యంతం ఎంతో అందంగా ఆకట్టుకునేలా తెరకెక్కించిన దర్శకురాలు నందిని రెడ్డిగారికి మరియు చిత్ర బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. ఇక సీనియర్ నటి లక్ష్మి గారు తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించారని ఆమె తన ట్వీట్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది…..!!

is magic and is magical !! It’s all things beautiful and honest congratulations and the team .. DO NOT miss this film !! More power to these power women

 

And how can I not mention Lakshmi garu !! She is adorable and how .. it’s such a delight to watch her on screen and her presence brings a smile on the face  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here