సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #SDT19 ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్

0
3
Supreme Hero Sai Durgha Tej #SDT19 Announced
Supreme Hero Sai Durgha Tej #SDT19 Announced

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, తేజ కాకుమాను, అనిల్ సుంకర, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక #SDT19 ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్.. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తన నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సాయి దుర్గ తేజ్ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం #SDT19ను అధికారికంగా ప్రకటించారు.

బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ‘బాహుబలి’ సహా పలు ప్రముఖ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, ఆ తర్వాత పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు #SDT19తో ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించాలనే లక్ష్యంతో ఉన్న తేజ కాకుమాను, సాయి దుర్గ తేజ్ కోసం ప్రత్యేకంగా ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారు. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో సాయి దుర్గ తేజ్‌ను చూపించేలా, ఆయన స్క్రీన్ పర్సనాలిటీలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఈ కథను రూపొందించారు. కథలోని ప్రత్యేకత, పాత్రలోని కొత్తదనం నచ్చడంతో సాయి దుర్గ తేజ్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

భారీ స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో పాటు కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను నిర్మించిన అనుభవం నిర్మాత అనిల్ సుంకర  ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. విభిన్నమైన కథలను తెరపైకి తీసుకురావడంలో ఆయనకున్న అనుభవం, నిర్మాణ విలువల విషయంలో చూపించే ప్రత్యేక శ్రద్ధ ఈ ప్రాజెక్ట్‌కు బలంగా నిలవనున్నాయి.

ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటుడు: సాయి దుర్గ తేజ్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: తేజ కాకుమాను
నిర్మాత: అనిల్ సుంకర
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: విశ్వ సి.ఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here