‘బిగిల్’ లో పాట పాడనున్న ఇళయదళపతి విజయ్…..!!

0
653

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బిగిల్. గతంలో విజయ్ తో తేరి, మెర్సల్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన అట్లీ కుమార్, ముచ్చటగా మూడవసారి విజయ్ తో తీస్తున్న ఈ చిత్రంపై కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కళాపతి ఎస్ అఘోరం సమర్పణలో ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందీస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ చిత్రంలోని ‘వెరితనం’ అనే పల్లవితో సాగే మొదటి పాటను హీరో విజయ్ స్వయంగా ఆలపిస్తున్నట్లు కాసేపటి క్రితం సినిమా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ ని విజయ్ పాడుతుండడంతో, ఆ పాటను త్వరగా విడుదల చేస్తే వినాలని విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ సరసన నయనతార జోడి కడుతున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, వివేక్, కథిర్, డానియెల్ బాలాజీ, ఆనంద్ రాజ్, ఇందుజా రవిచంద్రన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని అక్టోబర్ లో ప్రేక్షుకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్….!!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here