బిగ్ హిట్ సాధించాలన్న సింగిల్ ఎజెండా తో ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం రూపొందించాం – యంగ్ హీరో సందీప్ కిషన్

0
196

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జులై 12 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంటర్వ్యూ ….

హారర్ జోనర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు?
– అవునండీ!. ఈ జోనర్ లో అస్సలు సినిమా చేయొద్దు అనుకున్నా.. కానీ ఒక యాక్టర్ గా ఈ జోనర్ లో ఉండే సినిమాలంటే చాలా ఇష్టం. కానీ నటించ డానికిఅంతగా ఆస్కారం ఉండదేమో నని ఇప్పటివరకూఈ జోనర్ ని టచ్ చేయలేదు. ఈ కథ కుదిరినప్పుడు హారర్ ని మించి ఇంకా మంచి విషయం ఉంది. అది నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అలాగే అన్నిథ్రిల్ హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఏ ఒక్కరు కూడా థియేటర్ లో నుండి బయటకు వస్తూ ఇదిహారర్ సినిమా అని చెప్పరు. అలాంటి అనుభూతిని ఇచ్చింది కనుకనే ఈ సినిమాకు హీరో నే కాకుండా ప్రొడ్యూస్ కూడా చేశాను.

అంటే హారర్ కథను ఎంటర్టైన్మెంట్ వే లో చూపించారా?
– ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ అంతకు మించి మంచి ఎమోషన్ ఉంటుంది. ఇదొక హైలీ ఎమోషనల్ మూవీ. ఎమోషన్ అనే ఎలిమెంట్ ఈ సినిమాకు ప్లస్ అయింది. అలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా ఉంటుంది. పోసాని గారి క్యారెక్టర్ ఎక్స్ట్రార్డినరీ హ్యూమర్ ని జనరేట్ చేస్తుంది.

ఈ కథ నరేషన్ ఎలా జరిగింది?
– డైరెక్టర్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది హారర్ కథ అని చెప్పలేదు. ఒక కొత్త జోనర్ అని చెప్పాడు. ఆయన నరేషన్ స్టార్ట్ చేసాక ఏంటి హారర్ కథ చెబుతున్నాడు అనుకున్నా కానీ వెళ్లగా వెళ్లగా అదొక జోనర్ షిప్టింగ్ మూవీ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా 2043 లో మొదలయ్యి 2019 కి వస్తుంది. మళ్ళీ హారర్ జోనర్ ని దాటి ఒక ఎమోషనల్ ఫాక్టర్ తో వేరే జోనర్ లోకి వెళ్తుంది. నేను ఒక సినిమాకు ఎం ఎం చేయాలో అవన్నీ చేశాం. ఒక ఐదు నిమిషాల పాటు 25 ఏళ్ల తరవాత ప్రపంచం ఎలా ఉంటుందనేది చూపించాం.

సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
– సినిమాకు చాలా మంచి పాజిటివ్ బజ్ ఉంది. దాదాపు అన్ని ఏరియాలలో బిజినెస్ అయింది. ప్రేక్షకులలో కూడా ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయగలిగాము. జెన్యూన్ గా నేనే సినిమా తో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. జులై 12 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే నిను వీడని నీడను నేనే సినిమాను చూసి హిందీ రైట్స్ కోసం చాలా పెద్ద వ్యక్తులు ముందుకు వచ్చారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

ప్రొడ్యూసర్ గా ఏమైనా రిస్క్ ఫీల్ అయ్యారా?
– ఒక యాక్టింగ్ అంత కష్టతరమైన జాబ్ కాదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మూడు భాషల్లో కలిపి 28 సినిమాల్లోనటించాను. కాబట్టి అది నాకు అలవాటయింది. ఇక ప్రొడ్యూసర్ విషయానికి వస్తే నా సినిమాల్లో నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో వాటన్నింటిని ఈ సినిమాలో అవాయిడ్ చేయడం జరిగింది. ఈ జోనర్ లో ఎవరైతే బెస్ట్ టెక్నిషియన్స్ వారినే తీసుకోవడం జరిగింది.

ఫస్ట్ టైమ్ నిర్మాతగా మారారు కదా! ఇండస్ట్రీ నుండి ఎలాంటి సపోర్ట్ లభించింది?
– ఇండస్ట్రీలో నాకు జెమినీ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు. తెలుసు నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని వాళ్లకు చెప్పగానే ముందు వద్దన్నారు. తరువాత వాళ్ళే నాకు కొండంత అండగా నిలబడ్డారు. అనిల్ గారు మా సినిమాకు ప్రజెంటర్. ఈ సినిమా ఆయనది కూడా. ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసినది ఆయనే. ఆయన కాకుండా దయా పన్నెం నా ఫ్రెండ్, పార్ట్ నర్ ఎంతో అండగా నిలబడ్డాడు. నేను కథ చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు. నన్ను నమ్మారు. సినిమా చూశాక దయా హగ్ చేసుకున్నాడు. మనం అనుకున్నది కరెక్ట్ గా తీశామనే ధైర్యాన్ని ఇచ్చాడు. తరువాత థమన్, రామజోగయ్య శాస్రి గారు చూసి అభినందించారు. నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా… నిను వీడని నీడను నేనే నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెప్తున్నా.

మీతో పాటు దర్శకుడు, హీరోయిన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం అన్నారు?
– అవును. మా దర్శకుడు కార్తీక్ రాజు కి 46 ఇయర్స్. ఒక్కడు, సైనికుడు, అంజి లాంటి పెద్ద చిత్రాలకు గ్రాఫిక్స్ విభాగంలో పనిచేసారు. ఎనమిది సంవత్సరాలక్రితం మంచి లైఫ్ ని వదులుకొని డైరెక్టర్ అవుదామని వచ్చారు. అందుకు వాళ్ల ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత ఈ సినిమా మొదలుపెట్టాడు. అలాగే హీరోయిన్ మొదటి సినిమానే హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఇంట్రడ్యూస్ అయింది. దాని తరువాత తాను పడిన ఇబ్బందుల వల్ల ఇది రెండో సినిమాగా వస్తోంది. తాను చావును కూడా చాలా దగ్గరనుండి చూసి వచ్చింది. ఇవన్నీ సినిమా ఆడదానికి కారణం కాకున్నా దే డిసర్వ్ ఫర్ సక్సెస్.

సినిమా కథేంటి?
– ట్రైలర్ చూసుకుంటారు. అందులో సినిమా కథంతా చెప్పేశాం. స్క్రీన్‌ప్లే కూడా! ఒక అబ్బాయి ప్రేమలో పడతాడు. ఒక రోజు ల‌వ‌ర్‌తో క‌లిసి కారులో వెళ్తుండ‌గా యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత నుంచి అద్దంలో చూసుకుంటే తన బదులు మరొకరు కనిపిస్తారు. ఎందుకలా కనిపిస్తున్నారు? అనేది కథ. న్యూ ఏజ్ సినిమాను కొంచెం కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించాం.

మరి ట్రైలర్ లో చూపించిన గ్రీస్‌లో కుర్రాడి క‌థేంటి?
– నేను చెప్పను. మీరు సినిమాలో చూడండి. ఆ కుర్రాడి ఆత్మ ‘వెన్నెల’ కిషోర్ కావొచ్చు. పూర్వ జన్మలో నేనే ‘వెన్నెల’ కిషోర్ కావొచ్చు. ఆ కథను మేం రిఫరెన్స్ తీసుకున్నామా? అనేది తెరపై చూడాలి. హారర్ ఫాంటసీ ఫిల్మ్. ఎమోషన్ కూడా ఉంటుంది.

హారర్ కామెడీలు, హారర్ థ్రిల్లర్స్ వచ్చాయి. ‘నిను వీడని నీడను నేను’ ఎలాంటి సినిమా?
– హారర్ యూనివర్సల్ జానర్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లా తీసినా హిట్ అవుతుంది. ‘గృహం’లా తీసినా, ‘ప్రేమకథా చిత్రమ్’లా తీసినా హిట్ అవుతుంది. మా సినిమాలో కామెడీ ఉంటుంది. కానీ, కామెడీ కోసమని ఎక్కడా కామెడీ పెట్టలేదు. సినిమాలో నాకు అద్దంలో కనిపించేది ‘వెన్నెల’ కిషోర్. అంతకంటే ఏం చెప్పను? కథలో భాగంగా కామెడీ వస్తుంది. పోసాని కృష్ణమురళిగారు ఇరగదీశాడు. హారర్, కామెడీ కంటే ఎమోషన్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది.

మీ తదుపరి చిత్రాలు?
– జి. నాగేశ్వరరెడ్డిగారి దర్శకత్వంలో నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ షూటింగ్ మరో 20 రోజులు బాలన్స్ ఉంది. ‘నిను వీడని నీడని నేను’ విడుదల తరవాత షూటింగ్ పూర్తి చేసి, రెండు మూడు నెలల్లో విడుదల చేస్తాం. ఈ సినిమాతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అమెజాన్ కోసం మనోజ్ బాజ్‌పాయ్‌గారితో క‌లిసి రాజ్-డీకే దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ మాన్’ అని హిందీ వెబ్ సిరీస్‌లో కమాండో గా న‌టించాను. షూటింగ్ పూర్తయింది. యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేశా. మరో తెలుగు సినిమా చర్చల దశలో ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్ హీరో సందీప్ కిషన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here