యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న “ఇస్మార్ట్ శంకర్” బోనాలు సాంగ్…..!!

0
281

టాలీవుడ్ లో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న కొత్త సినిమాల్లో రామ్, పూరి జగన్నాథ్ ల కలయికలో రానున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మాస్, యూత్, లేడీస్ సహా అందరిని ఎంతో ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పూరి బ్రాండ్ డైలాగ్స్ వెరసి ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. ఇక నిన్న ఎంతో వేడుకగా జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో తమ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్ గా చెప్పారు.

ఇకపోతే నిన్న విడుదలైన ఈ సినిమాలోని బోనాలు అనే పల్లవితో సాగె మాస్ సాంగ్, ప్రస్తుతం దాదాపుగా 9 లక్షల వ్యూస్ తో అలానే 21 వేల లైకులతో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుంది. సినిమాలోని మొత్తం ఆల్బమ్ లో ఈ పాట మంచి హిట్ అయిందని, రేపు విడుదల తరువాత థియేటర్లో ఈ సాంగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయమని అంటోంది ఇస్మార్ట్ శంకర్ యూనిట్. ఇక ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here