మంచి అభిరుచి గల చిత్రాలను ప్రేక్షకులకు అందివ్వడంలో ముందుండే గీత ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్, కాసేపటి క్రితం తమ బ్యానర్ నుండి రాబోయే భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించారు. అల్లు అరవింద్, మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన చిత్రం ‘రామాయణ’ కు సంబంధించి కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన వెలుబడింది.
దంగల్ చిత్ర ఫేమ్ నితీష్ తివారి మరియు మామ్ చిత్ర ఫేమ్ ఉద్యావర్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్న ఈ భారీ చిత్రాన్ని మూడుభాగాలుగా 3Dలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇక ఈ మూడు భాగాల్లోని మొదటి భాగాన్ని 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ చిత్రంలోని నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తదితర విషయాలన్నీ త్వరలో వెల్లడి కానున్నాయి……!!


