కొత్తగా ‘రాజావారు రాణిగారు’ ఫస్ట్ లుక్ టీజర్

0
111

ఇటీవల కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించిన #RVRG పేరుతో కొన్ని మినిమల్ పోస్టర్స్ దర్శనమిచ్చి ప్రేక్షకులను సస్పెన్స్ లో పడేశాయి. అయితే చివరకు ఆ అక్షరాలకు ఉన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఎస్‌.ఎల్.ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు అది తమ చిత్ర టైటిల్ ‘రాజావారు రాణిగారు’ అని ప్రకటిస్తూ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. నూతన నటులు కిర‌ణ్ అబ్బ‌వ‌రం, రహ‌స్య గోర‌ఖ్ లు జంట‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే కథతో మంచి ఎంటర్టైనింగ్ గా రూపొందుతున్నట్లు సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు.

ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఉండే ఈ సినిమాలో ని పాత్రలని బుర్రకథ లాగా పరిచయం చేయడం కొత్తగా ఉంది. మంచి విజువల్స్ తో, నేపధ్య సంగీతం తో ఉన్న టీజర్ సినిమా పైన ఆసక్తి రేపుతోంది.  రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం, స్నేహమాధురి శర్మ, దివ్య నార్ని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : జై క్రిష్, ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, సాహిత్యం : సనపాటి భరద్వాజ పాత్రుడు, రాకెండు మౌళి తదితరులు అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here