“దొరసాని” చిత్రంలోని ‘కళ్ళలో కలవరమై’ వీడియో సాంగ్ విడుదల….!!

0
80

యువ నటుడు ఆనంద్ దేవరకొండ మరియు యువ నటి శివాత్మిక రాజశేఖర్ తొలిసారి తెలుగు తెరకు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం దొరసాని. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలకు వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో, చిత్ర యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక నిన్న ఘనంగా ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగింది. ఆనంద్ దేవరకొండ సోదరుడు యంగ్ డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఈ వేడుకలో ఎంతో సందడి చేసారు. ఇప్పటికే ప్రశాంత్ ఆర్ విహారి సారథ్యంలోని ఈ సినిమాలోని పాటలన్నీ కూడా శ్రోతల నుండి మంచి ఆదరణ పొందగా, నేడు ఈ సినిమాలోని ‘కళ్ళలో కలవరమై’ అనే పల్లవితో సాగే వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్.

సినిమాలో ఈ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని, అంతేకాక తమ సినిమా తప్పకుండా సక్సెస్ సాధించి యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకువస్తుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here