రేపు ఉదయం 10 గంటలకు అడివి శేష్ “ఎవరు” ప్రీ లుక్ రిలీజ్….!!

0
69

నటుడిగా మాత్రమే కాక స్క్రిప్ట్ రూపకర్తగా కూడా మంచి పేరు సంపాదించి అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో అడివి శేష్. ఇక ఇటీవల అయన నటిస్తున్న కొత్త చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఆ చిత్ర ప్రీ లుక్ ని రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. థ్రిల్లర్ నేపధ్యంలో విభిన్నమైన కథాంశంతో సాగనున్న ఈ చిత్రంతో వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

కొన్నాళ్లుగా ఈ చిత్రాన్ని గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చిత్రీకరణ జరిపామని, చిత్రంలోని ట్విస్ట్‌లు బయటికి తెలియకుండా ఉండటానికి ఈ విధంగా రహస్యంగా చిత్రీకరించినట్లు అడివి శేష్ ఇటీవల తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె నిర్మిస్తుండగా, శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం, అబ్బూరి రవి డైలాగులు, వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంలో శేష్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి చిత్రాన్ని ఆగ‌స్ట్ 23న విడుదల చేయనున్నట్లు సమాచారం….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here