తానా సభల కోసం అమెరికా చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్….!!

0
88

టాలీవుడ్ నటులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అయన స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయనకు ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించే తానా సభలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావలసిందిగా ఆహ్వానం అందడంతో, నిన్న రాత్రి అయన అమెరికా బయల్దేరారు. లైట్ గా గడ్డంతో మోడరన్ లుక్ లో అమెరికాలో ల్యాండ్ అయిన పవన్ ను ఎయిర్పోర్ట్ లో చూడగానే అక్కడి అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారట.

అంతేకాక తమవంటి ఎందరో అభిమానులకోసం అయన మరోక్క సినిమాలో నటిస్తే చూడాలని ఉందని తమ కోరికను వెలిబుచ్చడం జరిగిందట. అయితే తన పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితమని, భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే సినిమాల్లో తప్పక నటిస్తానని పవన్ వారికి సున్నితంగా సమాధానమిచ్చినట్లు సమాచారం. నిన్నటి నుండి ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన తానా సభలకు నేడు పవన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here