ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా చిత్రాలను అభినందించిన వరుణ్ తేజ్….!!

0
101

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టింది. ఇక తనకు ఏమాత్రం అవకాశం ఉన్నా, కొత్తగా విడుదలయ్యే చిత్రాలను చూసి, వాటిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే అలవాటున్న వరుణ్, ఇటీవల విడుదలైన రెండు విభిన్న చిత్రాలు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేరేవారెవరు పై నేడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తం చేసారు.

ఇటీవల నేను చూసిన ఈ రెండు చిత్రాలు వేటికవే మంచి ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాయి. ఇక రెండు చిత్రాల్లోని నటీనటులందరూ బాగా చేసారు, ముఖ్యంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంలో అలరించే నటనతో నవీన్ పోలిశెట్టి, అలానే బ్రోచేవారెవరురా చిత్రంలో నటనతో శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిని దోచారని అన్నారు. ఇంకా ఇప్పటివరకు ఆ రెండు చిత్రాలను చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్లి చూడండి అంటూ అయన పోస్ట్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here