ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు కార్తికేయ “గుణ 369″….!!

0
134

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్న యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం గుణ 369. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ వీక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టింది. ‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా పర్వాలేదు, కానీ పక్కనోడి జీవితానికి ఏ హాని జరగకూడదు’ అంటూ సీనియర్ నటులు సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. టీజర్ ని బట్టి చూస్తే ఇది ప్రేమ, యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు మిళితమైన చిత్రమని అర్ధం అవుతుంది.

స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యానర్లపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు 2న విడుద‌ల కానుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రం ద్వారా అనఘా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కురాలు ప్ర‌వీణ క‌డియాల మాట్లాడుతూ “మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితానికి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు… అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో `గుణ 369` టీజ‌ర్ ను ఇటీవ‌ల విడుద‌ల చేశాం.
చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సినిమా త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది“ అని అన్నారు

ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “తెలుగులో మంచి క‌థ‌ల‌తో సినిమా రావ‌ట్లేద‌ని చాలా మంది అంటుంటారు. మా `గుణ 369` చూసిన త‌ర్వాత ఇంకెప్పుడూ ఎవ‌రూ అలాంటి మాట‌లు అన‌రు. అంత‌గా అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా అప్ర‌మ‌త్తంగా చేస్తున్నాం“ అని చెప్పారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ “ యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం `గుణ 369`. షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకుని రావ‌డానికి స‌ర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ఔట్‌పుట్ చాలా బావుంది. ప్రేక్ష‌కుల‌కు అన్నివిధాలా న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కం క‌లిగింది“ అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here