అల్లూరి జయంతి సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన యూనిట్…..!!

0
440

బ్రిటిష్ వారిని ఎదిరించి తన జీవితాన్నే దేశంకోసం పణంగా పెట్టి ప్రాణాలు వదిలిన మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని తమ చిత్ర షూటింగ్ అప్ డేట్ ని ఇచ్చింది ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరిగా దర్శకధీరులు రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెతో నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విపరీతమైన అంచనాలున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం తమ చిత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుపుకుంటోందని, హీరోలు ఎన్టీఆర్, చరణ్ ఒక వారం బ్రేక్ తీసుకుని వచ్చే వారం మళ్ళి షూటింగ్ లో పాల్గొంటారని, ఇక నేడు అల్లూరి జన్మదినం సందర్భంగా ఆ వీరుడిని స్మరిస్తూ, తమ చిత్రంలో అల్లూరి పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ ను త్వరలో సినిమా తెరపై చూడాలని తాము కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నామంటూ చిత్ర బృందం తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here