“బ్రోచేవారెవరురా” చిత్రాన్ని అభినందించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు

0
73

మంచి వైవిధ్యమైన కథనంతో సాగే చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొంది దూసుకెళ్తున్న చిత్రం బ్రోచేవారెవరురా. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. చలనమే చిత్రము, చిత్రమే చలనము అనే ఉపశీర్షికతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మించగా, వివేక్ ఆత్రేయ రచన మరియు దర్శకత్వం అందించారు. ఇక ఈ చిత్ర అద్భుత విజయంపై కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక కొందరు సినిమా ప్రముఖులు సైతం తమ స్పందనను తెలియచేస్తున్నారు.

ఇక నేడు శతాధిక చిత్ర దర్శకులు, దర్శకేంద్రులు శ్రీ కె. రాఘవేంద్ర రావు గారు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వీడియో బైట్ ను పోస్ట్ చేస్తూ, ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. నిన్న తన సోదరి జన్మదినాన్ని పురస్కరించుకుని బ్రోచేవారెవరురా చిత్రాన్ని తమ కుటుంబసమేతంగా అందరం థియేటర్ కు వెళ్లి చూడడం జరిగిందని అన్నారు. ఇక చిన్న, పెద్ద అని తేడాలేకుండా ఈ చిత్రం అన్ని వర్గాలవారికి నచ్చుతుందని అయన అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రేక్షకుడికి ఏ మాత్రం బోర్ కొట్టించకుండా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం, అలానే నటులు శ్రీ విష్ణు, రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి, నివేత థామస్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని అన్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా చూసి ఆనందించాలని, ఇంత మంచి చిత్రాన్ని మనకు అందించిన బ్రోచేవారెవరురా చిత్ర బృందానికి అయన అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here