‘కామ్రేడ్ కళ్యాణ్’ను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా థాంక్స్: దసరా ఫన్‌డగ బ్లాక్ బస్టర్ మీట్ లో హీరో శ్రీ విష్ణు

0
2

‘కామ్రేడ్ కళ్యాణ్’ను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా థాంక్స్: దసరా ఫన్‌డగ బ్లాక్ బస్టర్ మీట్ లో హీరో శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దసరా ఫన్ డగ బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీం అందరికీ మేకర్స్ షీల్డ్స్ బహూకరించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణ మూర్తి, హరీష్ శంకర్, విఎన్ ఆదిత్య పాల్గొన్నారు.

‘దసరా ఫన్ డగ్ బ్లాక్‌బస్టర్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన హరీష్ శంకర్ గారికి, ఆర్. నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కృష్ణ గారు ప్రొడ్యూసర్ కంటే నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు. మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఈ సినిమాను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినందుకు ఆయనకు ధన్యవాదాలు. కోన గారితో పనిచేయడం, ఆయన అనుభవాన్ని షేర్ చేసుకోవడం నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన అన్ని కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. డైరెక్టర్ జానకితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. భాస్కరభట్ల గారు అన్ని పాటలను ఫెంటాస్టిక్‌గా రాశారు. ఆయన చెప్పినట్టుగానే ఈ ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయింది. పృథ్వీ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా అద్భుతంగా చేశారు. సుదర్శన్‌తో నా కెమిస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది. సత్య గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. తను లేకపోతే ఈ సినిమా లేదు. తను అద్భుతంగా చేశాడు. ఆ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నారాయణమూర్తి గారిని అవసరం వచ్చినప్పుడు తెరమీద చూపించడం మనందరి బాధ్యత. ఆయన గురించి మనందరం తెలుసుకోవాలి. అంత గొప్ప లెజెండ్ ఆయన. ఈ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఫస్ట్ రివ్యూ ఇచ్చింది హరీష్ శంకర్ గారు. ఈ సినిమా గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందని చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. బాలునందు నా కోసం రాసినట్టుగా రాస్తారు. వాళ్ల కామెడీ టైమింగ్‌తో తెలుగు ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా కలకలలాడాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఆర్. నారాయణమూర్తి గారు అంతసేపు మాట్లాడారంటే, అది ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఇచ్చిన ప్రేమ. ఈ సినిమాను ఆయన దీవించడం యూనిట్ అదృష్టం. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన స్థానం సుస్థిరం. కోన గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాను తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లారు. కృష్ణ గారు ఫస్ట్ సినిమాతోనే నిర్మాతగా సూపర్ సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. విప్లవాన్ని, వినోదాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయడం మామూలు విషయం కాదు. రైటింగ్, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. శ్రీ విష్ణు గారి స్పీడ్‌ను ఆడియన్స్ వోన్ చేసుకున్నారు. ఆయన మాట్లాడితే చాలు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్‌ను, ఎగ్జిబిటర్స్‌ను కాపాడే హీరో. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టెక్నికల్ టీమ్ అంతా అద్భుతంగా పనిచేశారు. ఈ సినిమా అన్‌లిమిటెడ్ డబ్బు సంపాదించాలని, మళ్లీ ఆ డబ్బును సినిమాలకు ఖర్చు చేయాలని కోరుకుంటున్నాను. కోన గారు కంటిన్యూగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

కోన వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీరందరూ మా కామ్రేడ్స్. మన జీవితంలో ప్రతి దశలో తోడుండేవాళ్లను కామ్రేడ్స్ అంటాం. ఈ సినిమాకు పనిచేసినవాళ్లందరూ కామ్రేడ్సే. ‘ఒరియా పిల్ల’ సాంగ్ ఒడిశాలో కూడా వైరల్ అయిపోయింది. రేపు ఒడిశాలో ఒక స్పెషల్ షో వేస్తున్నాం. మేము ఒక నలుగురం కలిసి ఈ సినిమాను మొదలుపెట్టాం. ఈరోజు 50 లక్షల మందికి పైగా ఈ సినిమా చేరువైంది. .‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్స్ విజిట్ చేస్తున్నప్పుడు అన్నీ హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. అప్పుడు ఈ సినిమాకు వచ్చిన గౌరవం, ఆదరణకు కారణం 100 శాతం తెలుగు ఆడియన్స్ అని అనిపించింది. మా డైరెక్టర్ జానకి నాకు పాలాభిషేకం చేశారు. కానీ మనం పాలాభిషేకం చేయాల్సింది ప్రేక్షకులకు. కృష్ణ గారికి సినిమాలంటే చాలా ఫ్యాషన్. ఇండస్ట్రీ మీద ఎంతో ఆసక్తి ఉన్న ప్రొడ్యూసర్‌గా ఎదుగుతారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. దీనికి కారణం ఏకైక వ్యక్తి మా శ్రీ విష్ణు. తనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా తన భుజాన వేసుకొని ఈ సినిమాను ప్రమోట్ చేశారు. తను ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఇలాంటి హీరోలు ఉన్నంతసేపు పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. అలాగే సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ అందరూ అద్భుతంగా చేశారు. సినిమాకు ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. శ్రీ విష్ణు గారు నిర్మాతలకు కావాల్సిన గొప్ప యాక్టర్. రవితేజ గారి వారసుడు, అప్‌కమింగ్ రవితేజ అని చెప్పవచ్చు. తన టాలెంట్‌ను ఉపయోగించి నిర్మాతలకు ఉపయోగపడుతున్న శ్రీ విష్ణు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పూరి జగన్నాథ్ గారు ‘దేశముదురు’ సినిమాలో టైటిల్ వచ్చినప్పుడు నా బొమ్మ వేశారు. ఆ తర్వాత ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితం చేశారు. నేను ఎంతో అదృష్టవంతుడిని. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. అలాగే సాయి ధరమ్ తేజ్ గారు ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నా అభిమానిగా కనిపించారు. అది నా అదృష్టం. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాకు కోన వెంకట్ గారు నా మీద ఉన్న అభిమానంతో హీరో గారితో నా కటౌట్ పెట్టించారు. నిజంగా నాకు మామూలు ఆనందం కలగలేదు. స్క్రీన్ మీద కటౌట్ చూస్తున్నప్పుడు మళ్లీ నా సినిమా రిలీజ్ అయిందా అన్నంత ఉత్సాహం వచ్చింది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు గారికి, కోన వెంకట్ గారికి, దర్శక రచయితలకు, ఈ చిత్ర బృందానికి సెల్యూట్ చేస్తున్నాను. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూస్తే సీరియస్ సినిమా అనుకుంటాం. కానీ ఇది మంచి కామెడీ సినిమా. మంచి లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా కూడా. ఇది ఎవరికీ వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు. పూర్తిగా వినోదాత్మక సినిమా. థియేటర్లలో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. జనం థియేటర్లకు తరలిరావడం చాలా ఆనందంగా ఉంది.

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. నిన్న కూడా హౌస్‌ఫుల్‌గా నడిచింది. చాలా రోజుల తర్వాత అర్థవంతమైన సినిమాను చూశాను. ఈ మధ్య అర్థంపర్థం లేని సినిమాలు వస్తున్నాయి. ఇది నేల మీద నడిచిన సినిమా. దీనికి దర్శక రచయితలకు క్రెడిట్ దక్కుతుంది. ఇది చాలా ఆహ్లాదకరమైన సినిమా. ప్రేక్షకులందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. శ్రీ విష్ణు గారు నిజంగా కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. కచ్చితంగా ఈ సినిమా చూడని వాళ్లు చూడండి. మీరు చాలా ఆస్వాదిస్తారు. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన సందేశం కూడా చెప్పారు. అది మీరందరూ చూడాలి. కోన వెంకట్ గారు మాకు స్ఫూర్తి.

వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు చాలా మంచి విజయాన్ని అందించారు. ఇది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సినిమా. శ్రీ విష్ణు గారిని అందరూ ప్రేమిస్తారు. కోన వెంకట్ గారి జర్నీ నాకు చాలా ఇన్‌స్పిరేషన్. ఆయన చిన్న, పెద్ద సినిమాలు అన్ని చేస్తుంటారు. డైరెక్టర్ జానకిరామ్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులు మరింత పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ.. సినిమాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ వేడుకకు వచ్చిన హరీష్ శంకర్ గారికి, ఆర్. నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. మేము పడిన కష్టానికి ప్రేక్షకులు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చారు. థియేటర్ విజిట్ చేస్తున్నప్పుడు వాళ్లు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది. అదంతా మాకు ఒక బ్లెస్సింగ్‌లా అనిపించింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ జనజీవన స్రవంతిలో కలిశాడు. రెండో వారంలో కూడా జనజీవన స్రవంతిలో ఉన్నాడు. జనాలు మాకు రూ. 30 కోట్ల రివార్డు ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు మనసుపెట్టి పనిచేశారు. విష్ణు గారు సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రమోషన్స్‌లో కూడా చాలా తిరిగారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయానికి కారణం ఆయనే. ఈ విజయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

డైరెక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ.. ఫస్ట్ వచ్చిన హిట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఈ ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా కూడా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కోన వెంకట్ గారు ఎంతోమంది దర్శకులను పరిచయం చేశారు. అందులో నేను కూడా ఒక భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు గారు నా దేవుడు. నాకు లైఫ్ ఇచ్చారు. జీవితాంతం నాకు దేవుడే. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు.

రైటర్ నందు మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గారితో ‘సామజవరగమన’, ‘సింగిల్’, ‘నారీ నారీ నడుమ మురారి’, ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో వరుసగా నాలుగు హిట్లు ఇచ్చారు. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవ్వించడానికి ఈ సినిమా తీశాం. ఇంకా చూడని వాళ్లు తప్పకుండా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

రైటర్ భాను మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గారితో నాలుగు సినిమాలను వరుసగా సక్సెస్‌ఫుల్‌గా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మా కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

భాస్కరభట్ల మాట్లాడుతూ.. నేను జర్నలిజం పక్కనపెట్టి పూర్తిగా సినిమా పాటలు రాయడానికి స్ఫూర్తినిచ్చింది ఆర్. నారాయణమూర్తి గారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మంచి పాటలు రాశాను. ఈ సినిమా విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకలో చిత్రబృందం సభ్యులందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here