విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “రణబాలి” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు మూవీ టీమ్.
కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – నేను ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా కంటే రశ్మిక, విజయ్ కు అభిమానిని. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక ఫ్యాన్ గా గర్వపడ్డాను. విజయ్, రశ్మిక అభిమానులు అందరికీ అదే ఫీల్ కలిగి ఉంటుంది. విజయ్ గారి విశ్వరూపం తెరపై చూశారు. అన్ని విధాలా ప్రేక్షకులు మా సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి మంచి మూవీ చేసిన మా డైరెక్టర్ కు థ్యాంక్స్. మల్టిపుల్ హై ఎపిసోడ్స్ కు థియేటర్స్ లో ప్రేక్షకులు ఊగిపోతున్నారు. అన్నారు.
మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ – మా సినిమాకు మార్నింగ్ టు మ్యాట్నీ ఇప్పుడు ఫస్ట్ షో..ప్రతి షో కు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది. జిల్లాల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. విజయ్ గారి కష్టం సినిమాలోని ప్రతి సీన్ లో కనిపిస్తుంటుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాను గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్, రశ్మిక గారి సీన్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారి ప్యాషన్ మూవీ ప్రొడక్షన్ మొత్తంలో కనిపిస్తోంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ – మేము ఈవెంట్స్ లో చెప్పినట్లు రశ్మిక, విజయ్ గారి ఎపిసోడ్స్ అన్నింటికీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వారి సీన్స్ రియలెస్టిక్ ఫీల్ తో ఆథెంటిక్ గా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్..ఇలా మేము ఎక్కడైతే ప్రేక్షకులు బాగా రెస్పాండ్ అవుతారని అనుకున్నామో అలాంటి అన్ని సందర్భాలకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో ప్రేక్షకుల స్పందన చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. రన్ టైమ్ కాస్త తగ్గిస్తే బాగుండును అనేవి చిన్న చిన్నవి చెబుతున్నారు. పీరియాడిక్ మూవీస్ లో కథ కోసం కొంత రన్ టైమ్ తీసుకుంటుంది. అయితే మ్యాట్నీ, ఫస్ట్ షోస్ కు అవన్నీ సర్దుకుని, ఆడియెన్స్ గ్రోత్ కనిపిస్తోంది. ఒక పెద్ద నెంబర్ ను బాక్సాఫీస్ వద్ద రణబాలి క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. ఏపీ తెలంగాణ లో ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాను బాగా చూస్తున్నారు. సుకుమార్ గారి వైఫ్ తబిత గారు కాల్ చేసి తనకు మూవీ చాలా బాగా నచ్చిందని చెప్పారు. మీరు థియేటర్స్ కు వెళ్తే రణబాలి ప్రపంచంలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – ఈ రోజు ఉదయం నుంచే యూఎస్ నుంచి మంచి టాక్ విన్నాం. అలాగే ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నేను థియేటర్స్ కు వెళ్లి అక్కడ ఆడియెన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి హ్యాపీగా ఫీలయ్యాను. విజయ్, రశ్మిక గారి పెయిర్ ను, వారి సీన్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా విజయ్ గారి కెరీర్ లో హ్యూజ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. ఇలాంటి మంచి మూవీని మా బ్యానర్ కు ఇచ్చినందుకు డైరెక్టర్ రాహుల్ కు థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ – మేము సినిమా తీసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థ్యాంక్స్. మార్నింగ్ సోషల్ మీడియాలో ఏవేవో వచ్చాయి గానీ తెలుగు మీడియా సినిమా చూసినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ వింటూ వచ్చాం. ఫస్టాఫ్ నుంచే రణబాలి బ్లాక్ బస్టర్ అనే రివ్యూ మీ దగ్గర నుంచి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఉన్న ఎన్నో లేయర్స్, మంచి ఉద్దేశం, చారిత్రక విషయాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఆడియెన్స్ అర్థం చేసుకుని రీల్స్ చేస్తున్నారు. మా మూవీ స్టోరీలోని ప్రతి డీటెయిల్ ఆడియెన్స్ కు అర్థం కావడం హ్యాపీగా ఉంది. మా మూవీలో కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని మనం తీసుకోవాలి, ఈ కథకు కొంత రన్ టైమ్ ఉంటుంది. మా సినిమాను ఇంకా చూడని వారు చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ రశ్మిక మాట్లాడుతూ – నేను నటించిన సినిమాలను కూడా ఒక ప్రేక్షకురాలిగా చూస్తుంటాను. రణబాలి సినిమాను విజయ్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నిన్న సాయంత్రం చూశాను. ఈ సినిమా బ్రిటీష్ పాలన, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలిమెంట్స్ తో చేయలేదు. ఈ సినిమా కథ ఆకలి, జీవనపోరాటం, సంఘర్షణ, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కింది. తన వారి కోసం నిలబడిన ఒక గొప్ప వ్యక్తి కథతో తెరకెక్కింది. మనం జీవితంలో ఏదైనా సంపాదించాలంటే, సాధించాలంటే పోరాడాలి. అదే రణబాలి. మన కోసం మనం పోరాడాలి అనే స్ఫూర్తిని ఈ సినిమా కలిగిస్తుంది. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. జయమ్మ, రణబాలి పాత్రలను మలచిన తీరు ఆకట్టుకుంది. అదంతా మా దర్శకుడి క్రెడిట్. నేను సీన్ యాక్ట్ చేసేప్పుడు మానిటర్ లో ఔట్ పుట్ చూడను, డైరెక్టర్ ఓకే అంటే ఓకే. స్క్రీన్ మీద సినిమాను ఒక ఆడియెన్ లా చూస్తా. రణబాలి లో మా సీన్స్ చూస్తుంటే సర్ ప్రైజ్ అయ్యాను. ఒక దర్శకుడు ఏదైనా ప్రత్యేకంగా రాసినప్పుడు అది పర్ ఫార్మ్ చేసినప్పుడు యాక్టర్స్ గా గర్వపడుతుంటాం. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూడాల్సిన సినిమా. అన్నారు
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – మన మీడియా మిత్రులు రణబాలి సినిమా చూసి ఫోన్స్ చేసి మాట్లాడిన మాటలు, మీరు పంపిన మెసేజ్ లు చూసి ఈ రోజు మిమ్మల్ని కలవాలని ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాం. మేము నిన్న సాయంత్రమే సినిమా చూశాం. ఇది ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను. మా కెరీర్ లో గర్వపడే సినిమా అవుతుంది. ఇది నా 14వ సినిమా. మనం ఒక ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్ ఫార్మెన్స్ గురించి, ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రమే రణబాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది. ఎందుకంటే మన మీడియా మిత్రులే ఈ సినిమాను తమ భుజాలపై పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా ఎంత దూరం వెళ్తుందో నాకు తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొట్టాలి, పెద్ద నెంబర్స్ క్రియేట్ చేయాలని అటెంప్ట్ చేయలేదు. ఈ సినిమా మన వాళ్లకు చూపించడం చాలా ముఖ్యమని భావించి చేశాం. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కూడా మీకు మా మూవీ చూస్తున్నప్పుడు ఎన్నో లేయర్స్ కనిపిస్తాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ ఒక ప్యాకేజ్ లా చేశాడు. కొన్ని ఎపిసోడ్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. నా ఫిల్మోగ్రఫీ, తెలుగు సినిమా ఫిల్మోగ్రఫీలో రణబాలి ఒక ముఖ్యమైన చిత్రంగా మిగిలిపోతుంది. రేపు విజయవాడ, అనంతపురం, శింగనమల, గుంటూరు, వైజాగ్..ఇలా అన్నిప్రాంతాలకు వెళ్లి మన ఆడియెన్స్ ను కలుస్తాను. రశ్మిక కూడా మన సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతోంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారితో ఒక క్యూట్ రోమ్ కామ్ మూవీ చేస్తున్నాను. విక్రమ్ గారు అలాంటి స్క్రిప్ట్ తీసుకొచ్చారు కాబట్టి చేయగలుగుతున్నా. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి సినిమాను బాగా ఇష్టపడే చేస్తున్నాను. ఈ చిత్రాన్ని హిందీలోనూ తీసుకురావాలని అడుగుతున్నారు. అలాగే తమిళంలోనూ రిలీజ్ చేస్తాం. మేము టార్గెట్ చేసింది మాత్రం తెలుగులోనే. ఒక్కో హీరో తనకు నచ్చిన కథను తెరపైకి తెస్తుంటారు, అయితే కొన్ని కారణాల వల్ల సినిమా, దాని చుట్టూ ఉన్న బిజినెస్ ఒక పరుగుపందెం అవుతోంది. అన్నారు.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా, జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – సురేష్ ( ఎస్ కె మీడియా )
మార్కెటింగ్ – ఫస్ట్ షో



