కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమలాపాల్. ఆమె నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ఆమె. ఆకట్టుకునే థ్రిల్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి సస్పెన్స్ జానర్ లో సాగే ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇక ఈ చిత్ర తమిళ టీజర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ విడుదల చేయగా తెలుగు టీజర్‌ను ఇటీవల సంచనల దర్శకులు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. తమిళంలో ‘ఆడై’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు.
తమిళ చిత్రం ‘మయాతా మాన్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ‘వి స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. భిన్నమైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమలా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ఆమె చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
నటీనటులు: అమలా పాల్
టెక్నికల్ టీం:
రచన, దర్శకుడు: రత్నకుమార్
నిర్మాతలు: రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని
సహ నిర్మాత: J. ఫణీంద్ర కుమార్
సంగీతం: ప‌్రదీప్ కుమార్, ఊర్క
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ ఖన్నన్
మాటలు: రాజేష్ A మూర్తి
లిరిక్స్: భువన చంద్ర
సౌండ్ డిజైన్: సంపత్ అల్వార్ (MPSE)
సౌండ్ మిక్స్: T. ఉదయ్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: విదేశ్
స్టంట్స్: స‌్టన్నర్ స్యామ్
కాస్ట్యూమ్ డిజైనర్: కవిత J
పబ్లిసిటీ డిజైనర్: అముధన్ ప్రియన్
కలరిస్ట్: G బాలాజీ
VFX ప్రొడ్యూసర్: హరిహరసుథన్
డాన్స్ కొరియోగ్రఫర్: M షరీఫ్, అబు
PRO: వంశీ శేఖర్


