యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం బుర్రకథ. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా యూట్యూబ్ లో విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబడుతోందని, ఇక ఆద్యంతం మంచి వినోదాత్మకంగా సాగె తమ చిత్రం, కూడా రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకులకు చేరువ అవుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలకు పదునైన మాటలను అందించిన డైమండ్ రత్నబాబు గారు, తొలిసారి ఈ చిత్రం ద్వారా మెగా ఫోన్ పడుతున్నారు. హీరోకు రెండు మెదళ్ళు ఉండడం అనే వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
ఆది సరసన నైరా షా, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, అభిమన్యు సింగ్, జబర్దస్త్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత ఈనెల 28న విడుదల చేయాలనీ భావించారు, అయితే కొన్ని అనివార్య కారణాల వలన చిత్ర విడుదల వాయిదా పడడంతో, కాసేపటి క్రితం తమ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది….!!