కన్నడలో విడుదలకు సిద్దమైన మెగా పవర్ స్టార్ “రంగస్థలం” చిత్రం

0
520

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సూపర్ డూపర్ హిట్ చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ నాచురల్ యాక్టింగ్, సుకుమార్ మార్క్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, హీరోయిన్ సమంత సహా ఇతర నటీనటుల ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ వెరసి రంగస్థలం చిత్రాన్ని ఘనవిజయం సాధించేలా చేసాయి.

తెలుగులో ఇప్పటికే ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం, అతి త్వరలో కన్నడ నాట ‘రంగస్థల’ పేరిట సందడి చేయనుంది. జులై 12వ తేదీన ఈ చిత్రం కన్నడ వర్షన్ అక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగులో సంచలన అందుకున్న నేపథ్యంలో, ఈ చిత్ర హక్కులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. దానితో చిత్రాన్ని ప్రస్తుతం డబ్బింగ్ చేసి కన్నడలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here