విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా ప్రస్తుతం రెండు చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఒకటి ‘రణరంగం’ చిత్రం. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా స్వామి రారా, దొచెయ్, కేశవ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలతో కూడిన కథ, కథనాలతో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఒక విభిన్న తరహాపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. రేపు సాయంత్రం గం. 4.05ని. లకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటన విడుదల చేసింది రణరంగం చిత్ర బృందం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో, సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం: ప్రశాంత్ పిళ్ళై, ఛాయాగ్రహణం: దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు: వెంకట్, నృత్యాలు: బృంద, శోభి, శేఖర్. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


